దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, దేశ రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు మచ్చలేని ఏకైక ముఖ్యమంత్రి అని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో చంద్రబాబుకు క్లీన్ చిట్ లభించడం ఆయన నిర్మలమైన వ్యక్తిత్వానికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు. ఐదేళ్ల పాలనలో అవినీతి, అక్రమాలు, దోపిడీలకు పాల్పడిన వైఎస్ జగన్ రెడ్డి, కుట్రపూరితంగా చంద్రబాబును జైల్లో నిర్బంధించి పైశాచిక ఆనందం పొందారని ఆమె విమర్శించారు.