ప్రకాశం జిల్లా కురిచేడు మండలం గంగవరం గ్రామ సమీపంలో పేకాట ఆడుతున్న ఐదుగురు వ్యక్తులను స్థానిక పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 24,780 నగదును స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. పేకాట ఆడటం చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరించారు.