మద్యం తాగి వాహనం నడిపిన12 మందికి భారీ జరిమానా

ప్రకాశం జిల్లా దర్శి సర్కిల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ 12 మందికి దర్శి కోర్టు ఒక్కొక్కరికి రూ. 10 వేల జరిమానా విధించింది. మరో వ్యక్తికి 30 రోజుల జైలు శిక్ష పడింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వారిపైనా కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని దర్శి సీఐ రామారావు హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్