నా ఆధ్వర్యంలో క్రికెట్ స్టేడియం నిర్మించడం ఆనందం

ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజబాబు బుధవారం దర్శిలో పర్యటించి, దర్శి నియోజకవర్గంలో నూతన క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తన ఆధ్వర్యంలో ఈ స్టేడియం నిర్మించడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు. అధికారులు ప్రజలకు గుర్తుండిపోయే పనులు చేయాలని, భవిష్యత్తులో తీపి గుర్తులుగా నిలిచిపోతాయని ఆయన పేర్కొన్నారు. అధికారులు తరచుగా విధులు నిర్వహించే ప్రాంతాలు మారుతుంటాయని, ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు మంచి పనులు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్