ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బోధనంపాడులో మోంథా తుఫాన్ ప్రభావంతో మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంక్ కూలిపోయింది. గురువారం అర్ధరాత్రి సమయం కావడంతో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గత కొన్ని సంవత్సరాలుగా గ్రామానికి నీటినందించిన ట్యాంక్ కూలిపోవడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.