ఒంగోలులో మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ తీర్మానం చేసిన సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి శుక్రవారం మాట్లాడారు. రాష్ట్రంలో పరిశ్రమలు, సంక్షేమం, అభివృద్ధి జరుగుతున్నా, అధికారంలో లేనివారు ఆరోపణలు చేస్తున్నారని ఆమె విమర్శించారు. బాధ్యత మరిచి అసెంబ్లీకి వెళ్లకుండా బయట ధర్నాలు చేస్తున్నారని, వారు పదవులకు రాజీనామా చేయాలని ఆమె అన్నారు.