పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

ప్రకాశం జిల్లా దర్శి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో ఓ యువకుడు పురుగులు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జులాయి తిరుగుళ్ళు తిరుగుతున్నాడని కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పురుగులు మందు తాగిన క్రమంలో కుటుంబ సభ్యులు ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్