ముండ్లమూరులో భారీ చోరీ

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని ఉల్లగల్లులో సోమవారం రాత్రి శిఖకొల్లి శంకర్రావు ఇంట్లో దొంగతనం జరిగింది. కుటుంబంతో కలిసి సింగరకొండ తిరునాళ్లకు వెళ్లిన సమయంలో, దొంగలు తలుపులు పగులగొట్టి 11 సవర్ల బంగారం, అర కేజీ వెండి, రూ. 20 వేల నగదును అపహరించారు. మంగళవారం ఎస్సై కమలాకర్ క్లూస్ టీమ్‌తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్