ప్రకాశం జిల్లా ముండ్లమూరులో వరకట్నం వేధింపులపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఎస్సై కమలాకర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని వేముల బండ గ్రామానికి చెందిన సునీత దొనకొండ మండలానికి చెందిన గోవిందులు ప్రేమ వివాహం చేసుకున్నారు. హైదరాబాదులో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నారు. కొద్దిరోజులుగా అదనపు కట్నం తీసుకురావాలని భర్త వేధిస్తున్నాడని సునీత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశామన్నారు.