ముండ్లమూరు: వివాహిత ఆత్మహత్య

ముండ్లమూరు మండలంలోని తూర్పుకంబాలపాడు గ్రామంలో బుధవారం ఓ వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వివాహిత మనస్థాపంతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా విచారణలో పోలీసులు గుర్తించారు. ఉరివేసుకున్న సమయంలో వివాహితను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అన్నారు.

సంబంధిత పోస్ట్