ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం మాధవరంలో నైజీరియా కొంగలు సందడి చేస్తున్నాయి. ప్రతి ఏటా ఎండాకాలంలో నైజీరియా నుంచి వచ్చే ఈ పక్షులు ప్రస్తుతం 300 పైగా ఉన్నాయి. ఇవి బస్టాండ్ సెంటర్, ఆలయాల వద్ద చెట్లపై, మద్దిపాడు మండలం గుళ్లకమ్మ జలాశయంలో ఆహారం తీసుకుంటున్నాయి. మరో రెండు నెలల్లో సంతానోత్పత్తి అనంతరం ఇవి తమ స్వదేశానికి తిరుగుపయనమవుతాయి.