ప్రకాశం జిల్లా కొరిచేడు మండలం కల్లూరు గ్రామంలో మంగళవారం కుటుంబ కలహాల నేపథ్యంలో అల్లుడు తన అత్తపై రాడ్డుతో దాడి చేసి రెండు కాళ్ళను విరగ్గొట్టాడు. ఈ ఘటనలో బాధితురాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.