రోడ్డు ప్రమాదంలో టీడీపీ కార్యకర్త మృతి

దొనకొండ మండలంలోని మంగినపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్త కోట్ల కృపమ్మ(51) రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఆమె తన కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంపై వస్తుండగా, ఎదురుగా వచ్చిన మరో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కృపమ్మ తలకు బలమైన గాయాలయ్యాయి. దర్శిలో ప్రథమ చికిత్స అనంతరం ఒంగోలు రిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె మరణించారు. ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించగా, టీడీపీ నాయకులు నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్