పిచ్చికుక్క దాడిలో పదిమందికి గాయాలు

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని మారెళ్ళలో శనివారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. వీధుల్లో తిరుగుతున్న పదిమందికి పైగా వ్యక్తులపై దాడి చేసి గాయపరిచింది. గాయపడిన వారంతా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి చికిత్సలు చేయించుకున్నారు. గ్రామానికి చెందిన మస్తాన్బీ, సాయి, చందు, శ్రీనులతో పాటు మరికొంత మంది ఈ దాడిలో గాయపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్