ఉమ్మడి ప్రకాశం జిల్లాలో శుక్రవారం వైసీపీ శ్రేణులు 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' కార్యక్రమంలో భాగంగా భారీ నిరసన ర్యాలీలు చేపట్టాయి. దర్శిలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో, ఇంటింటికి సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబే అన్న వీడియో వైరల్ అవ్వడంపై చర్చ జరిగింది. ఇది మార్ఫింగ్ చేశారా లేక నిజంగా తప్పు దొర్లిందా అన్నది ప్రశ్నగా మారింది.