ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని నూజిల్లపల్లి - గంగన్నపాలెం గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మారెళ్ళకు చెందిన తొట్టెంపూడి అశోక్, అద్దంకికి చెందిన షేక్ ఆరీఫ్, మరియు గర్నేపూడి ఆరోనులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.