శుక్రవారం రాత్రి మార్కాపురం జిల్లా ముండ్లమూరు మండలంలోని నూజిలపల్లి, గంగన్నపాలెం గ్రామాల మధ్య రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మారెళ్లకి చెందిన ఆరోన్, అద్దంకికి చెందిన అశోక్, షేక్ హరి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని ఒంగోలుకు తరలించారు.