తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడలేదని సీట్ వెల్లడించిన నేపథ్యంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. దర్శిలో వెంకటేశ్వర స్వామి ఆలయ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సనాతన ధర్మం పేరుతో పవన్ కళ్యాణ్ రకరకాల వేషాలు వేస్తుంటారని, ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్లారని విమర్శించారు.