ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని 15 గొర్రెలు మృతి

మార్కాపురం జిల్లా కంభం మండలం జంగంగుంట్ల గ్రామ సమీపంలో అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గొర్రెల గుంపును ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 గొర్రెలు మృతిచెందగా, మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. దీంతో రైతు సుమారు రూ. 6 లక్షల నష్టపోయినట్లు వాపోయాడు. ఆగ్రహించిన గ్రామస్తులు బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. వర్షం కారణంగా రహదారి కనిపించక ప్రమాదం జరిగినట్లు బస్సు డ్రైవర్ తెలిపారు. స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్