రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

కంభం మండలం కందులాపురం సెంటర్లో లారీ, ద్విచక్రవాహనం మంగళవారం రాత్రి ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో కంభం పట్టణానికి చెందిన దిలీప్ కుమార్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి మరణించాడు. మొదట అతన్ని కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్