ప్రకాశం జిల్లా గిద్దలూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా కార్యాలయం లోకి ప్రవేశించిన ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి ఎవరిని అనుమతించలేదు. లోపల సబ్ రిజిస్టర్ ను సంబంధిత సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం అందింది. మరికొద్ది సేపట్లో పూర్తి సమాచారం ఏసీబీ అధికారులు వెల్లడించనున్నారు.