సమ్మె నోటీస్ ఇచ్చిన అంగన్వాడీలు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, అలాగే అంగన్వాడి వర్కర్ల సమస్యల పరిష్కారం కోరుతూ గిద్దలూరు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలు ఫిబ్రవరి 12వ తేదీన సమ్మె చేయనున్నాయి. ఈ మేరకు గిద్దలూరు ఐసిడిఎస్ అధికారి కె మహితకు సమ్మె నోటీసులు అందజేశారు. కార్మికులను బానిసలుగా మార్చే లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, గత సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలని అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు డి స్వర్ణ, ఏ మున్న డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా సమస్యలు పరిష్కారం కాలేదని వారు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్