ప్రజా దర్బార్ కార్యక్రమంలో అర్జీలు స్వీకరణ

గిద్దలూరు టిడిపి కార్యాలయంలో శనివారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై ఎమ్మెల్యేకు అర్జీలు సమర్పించారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అర్జీలను పరిశీలించి, కొన్నింటిని వెంటనే పరిష్కరించారు. క్లిష్టమైన సమస్యలను కూడా అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్