మార్కాపురం జిల్లా కంభం మండలం తురిమెళ్ల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ యేలం వెంకటరమణ (45) అసోం రాష్ట్రం దిబ్రూగఢ్‌లో స్ట్రోకు గురై మంగళవారం మృతి చెందారు. ఆర్డినరీ లెఫ్టినెంట్ హోదాలో ఉన్న ఆయన సోమవారం విధుల్లో ఉండగా అస్వస్థతకు గురయ్యారు. నెల రోజుల క్రితమే ఆయన తండ్రి వేమయ్య మృతి చెందడంతో గ్రామానికి వచ్చి దశదిన కర్మలు నిర్వహించి విధుల్లో చేరారు. తండ్రి మరణించిన నెల రోజులకే కుమారుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.