బేస్తవారిపేట: అక్రమంగా మద్యం కలిగి ఉన్న వ్యక్తి అరెస్టు

ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పాత మల్లాపురం గ్రామంలో సోమవారం అక్రమంగా మద్యం కలిగి ఉన్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని కంభం ఎక్సైజ్ సీఐ కొండారెడ్డి మీడియాకు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి 15 క్వాటర్ల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. మద్యం కలిగి ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేశామని అక్రమంగా మద్యం తరలించడం కలిగి ఉండడం చట్టరీత్య నేరమని కొండారెడ్డి హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్