బేస్తవారపేట మండలంలోని పిటికాయగుళ్లలో ఉన్న ఆయుర్వేద వైద్యశాల భవనం తీవ్రంగా పాడైపోయింది. దాదాపు 30 ఏళ్లుగా ఉన్న ఈ భవనంలో కిటికీలు ఊడి, తలుపులు పడిపోతున్నాయి. విద్యుత్, నీటి సౌకర్యాలు లేవు. మరుగుదొడ్లు పనికిరావు. బెంచీలు లేక రోగులు నేలపైనే కూర్చోవాల్సి వస్తోంది. పిచ్చిమొక్కలు పెరిగిపోతున్నాయి. దీంతో సిబ్బంది కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.