ప్రకాశం జిల్లా కంభం మండలంలోని కంభం చెరువును సందర్శించేందుకు కలెక్టర్ రాజాబాబు శనివారం ఉదయం వస్తున్నారు. పూర్తిస్థాయిలో నిండి అలుగుపారుతున్న ఈ చెరువును పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలోనే చెరువును పరిశీలించిన కలెక్టర్, అభివృద్ధి పనులపై చర్చించేందుకు మరోసారి వస్తున్నట్లు అధికార యంత్రాంగం తెలిపింది.