కొమరోలు: గొడ్డళ్లు, కత్తులతో దాడులు

కొమరోలు మండలంలోని గోనెపల్లి గ్రామంలో బుధవారం పొలం వివాదం నేపథ్యంలో ఇరు కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. ఘటనలో మొత్తం ఐదు మంది గాయపడగా వారిని గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి అంబులెన్స్ లో తరలించారు. దాడి జరిగిన ఘటనపై గాయపడ్డ వారి కుటుంబ సభ్యులు మీడియాకు వివరాలు వెల్లడించారు. కత్తులు గొడ్డలితో తమపై దాడికి పాల్పడినట్లుగా బాధితులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్