ప్రకాశం జిల్లా కొమరోలు మండలంలో రేపు మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని ఏ. ఈ శ్రీనివాసులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా ఉదయం 8: 30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సురవారిపల్లి, చింతలపల్లి పంచాయతీల పరిధిలో విద్యుత్ సరఫరా ఆగిపోతుందని శ్రీనివాసులు వెల్లడించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.