కంభంలో మెగా పేరెంట్స్ మీట్‌కు ముందుగా పాఠశాలలకు మొక్కల పంపిణీ

కంభంలో రేపు జరుగనున్న మెగా పేరెంట్స్ మీటింగ్లో అమ్మ పేరుతో మొక్కలు నాటేందుకు మండలంలోని అన్ని పాఠశాలకు బుధవారం మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంఈవోలు అబ్దుల్ సత్తార్, శ్రీనివాసులు మాట్లాడుతూ పాఠశాలల విద్యార్థులు తల్లి గౌరవార్థం ఏక్ పేడ్ మా కే నామ్ పేరిట ఓ మొక్కను నాటనున్నట్లు తెలిపారు. అలాగే పేరెంట్స్ సమావేశాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్