మార్కాపురం జిల్లా అర్ధవీడు మండలం గంటాపురం గ్రామంలో మంగళవారం పిడుగుపాటుకు మహిళ రైతు కూలీ శోభారాణి మృతి చెందింది. పొలంలో పనిచేస్తుండగా అకస్మాత్తుగా పిడుగు పడడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానిక పోలీసులు సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.