హెల్మెట్ లేని వారికి జరిమానా

శుక్రవారం రాత్రి మార్కాపురం జిల్లా కంభం సమీపంలోని అమరావతి అనంతపురం జాతీయ రహదారిపై, హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతున్న వాహనదారులకు స్థానిక ఎస్సై శివకృష్ణారెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రమాదాలు జరిగితే హెల్మెట్ లేకపోవడం వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అనంతరం నిబంధనలు పాటించని వారికి జరిమానా విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్