అగ్ని ప్రమాదంపై వివరాలు వెల్లడించిన ఫైర్ ఆఫీసర్

గిద్దలూరు ఎస్ఎస్ ప్లాజాలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదానికి ఏసీలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని గిద్దలూరు అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశామని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన వెల్లడించారు. ఎండాకాలంలో అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్