గుండెపోటుతో మాజీ జర్నలిస్టు మృతి

మార్కాపురం జిల్లా గిద్దలూరుకు చెందిన మాజీ జర్నలిస్ట్ అమినుద్దీన్ (మున్నా) బుధవారం గుండెపోటుతో మరణించారు. గతంలో ఎన్టివి రిపోర్టర్ గా పనిచేసిన ఆయన, ఉదయం తన దుకాణానికి వెళ్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన మృతితో స్థానిక జర్నలిస్టులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

సంబంధిత పోస్ట్