బేస్తవారిపేటలో మాజీ ఎమ్మెల్యే పుట్టినరోజు వేడుకలు

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం చింతలపాలెం గ్రామంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత మార్కాపురం వైసిపి ఇన్ ఛార్జ్ అన్నా వెంకట రాంబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక వైసిపి నాయకులు పేదలకు దుస్తులు, పండ్లు, కేకు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. అన్నా వెంకట రాంబాబు పేదల గుండెల్లో చిరగని ముద్ర వేసుకున్నారని వైసిపి నాయకులు అన్నారు. కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్