భయపెట్టిన ఉరుములు, మెరుపులు

గిద్దలూరు పరిసర ప్రాంతాలలో బుధవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. మధ్యాహ్నం వరకు తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడిన వారికి మబ్బులు పలకరించాయి. కొన్ని చోట్ల చిరుజల్లులు కురిశాయి. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పిడుగుల శబ్దాలు ప్రజలను మరింత భయపెట్టాయి. వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఉపశమనం పొందారు.

సంబంధిత పోస్ట్