గిద్దలూరులో పెట్రోల్, డీజిల్ కొరత ఒకటి రెండు రోజుల్లో తీరుతుందని, ఇంధన ధరలు పెరగవని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెటింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు, రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, ఇంధన పంపిణీలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు.