గిద్దలూరు మండలం కృష్ణం శెట్టిపల్లి గ్రామంలో ఆదివారం కోడిపందాల స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులను చూసి జూదరులు పరారయ్యారు. సంఘటనా స్థలం నుంచి ఎనిమిది ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకుని గిద్దలూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. కోడిపందాలు ఆడుతున్న వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అర్బన్ సిఐ సురేష్ తెలిపారు.