మార్కాపురం జిల్లా కంభం మండలంలో వరుస దొంగతనాలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కంభం పట్టణంలోని ABM పాలెంలో ఉపాధ్యాయుడు ప్రదీప్ కుమార్ ఇంట్లోకి చొరబడిన దొంగలు, రెండు బీరువాలను పగలగొట్టి 5 తులాల బంగారం, రూ. 8 వేల నగదును అపహరించారు. ఈ నెల 25న కుటుంబంతో కడపకు వెళ్లిన ప్రదీప్ కుమార్ బుధవారం రాత్రి తిరిగి వచ్చి దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. ఒకే నెలలో మండలంలో ఆరు దొంగతనాలు జరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.