ప్రకాశం జిల్లా గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయంలో 70 ఏళ్లగా అలసిపోకుండా ఓ ఫంఖా(ఫ్యాన్) తిరుగుతూనే ఉంది. గతంలో గిద్దలూరు పంచాయతీగా ఉన్న కార్యాలయం కాలక్రమంలో నగర పంచాయతీ కార్యాలయముగా రూపాంతరం చెందింది. కార్యాలయంలోకి ఎవరు ప్రవేశించిన మొదట ఆ ఫంఖా నే దర్శనమిస్తుంది. ఒక్కసారి కూడా మరమ్మతులకు గురికాకుండా నేటికీ ఆ ఫంఖా తిరుగుతూనే ఉండడం ఆకర్షణగా మారిందని కార్యాలయ సిబ్బంది ఆదివారం తెలిపారు.