సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు పట్టణాల నుంచి పల్లెలకు తరలి వెళ్తున్నారు. మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలో ముందుగానే సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. కమిషనర్ రమణబాబు ఆధ్వర్యంలో పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. మున్సిపల్ కార్యాలయం నుంచి అమరావతి అనంతపురం జాతీయ రహదారి వరకు ప్రధాన రహదారిపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పట్టణం ప్రకాశవంతంగా మారింది. పట్టణ అందాన్ని చూసి స్థానికులు కమిషనర్‌ను ప్రశంసిస్తున్నారు.