ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు నాయకులు ఆవులయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం గిద్దలూరు పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన సిఐటియు నాయకులు ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం కార్మికులను విస్మరిస్తూ ఇబ్బందులకు గురిచేస్తుందని సిఐటియు నాయకులు తెలిపారు. ఈ క్రమంలో సీఐటీయూ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.