గిద్దలూరు సబ్ రిజిస్టర్ కృష్ణమోహన్ రూ. 35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. గురువారం ఆకస్మికంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు తనిఖీ చేశారు. పట్టణానికి చెందిన ఖాదర్ భాషా తన తల్లికి సంబంధించిన ఇంటిని రిజిస్టర్ చేయించుకునేందుకు సబ్ రిజిస్టర్ ను సంప్రదించగా సబ్ రిజిస్టర్ లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో అవినీతి చేపను వలవేసి పట్టుకున్నారు.