రాయపూడి సీడ్ యాక్సెస్ రోడ్డుపై ఆదివారం ఉదయం బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో నారాయణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మార్కాపురం (D) గిద్దలూరుకు చెందిన నారాయణ తుళ్లూరులో పనుల నిమిత్తం బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తలకు గాయాలైన అతన్ని స్థానికులు 108 ద్వారా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.