గిద్దలూరు: అర్థరాత్రి రోడ్డు ప్రమాదం.. ఉపాధ్యాయుడి మృతి

శనివారం అర్థరాత్రి అనంతపురం-అమరావతి జాతీయ రహదారిలోని ఎడవల్లి క్రాస్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 27 ఏళ్ల ఉపాధ్యాయుడు అభిషేక్ మృతి చెందాడు. కారులో అమరావతి వెళ్తున్న అభిషేక్, మరో వ్యక్తి ప్రయాణిస్తున్న కారు ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అభిషేక్ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్