ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేటలో బుధవారం అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి పది మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామని సీఐ జయరావు వెల్లడించారు. మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామని అక్రమంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవని సీఐ జయరావు ప్రజలను హెచ్చరించారు.