ప్రకాశం జిల్లా గిద్దలూరులోని గణేష్ నగర్ లో నివాసముంటున్న యగటిల లక్ష్మీ ప్రశాంతి సోమవారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. తన అత్తతో పాటు ఆడబిడ్డ, ఆడబిడ్డ భర్త వేధింపులకు గురి చేస్తున్నారని లక్ష్మీ ప్రశాంతి ఆత్మహత్యకు యత్నించినట్లుగా ఆమె భర్త రంగనాయకులు తెలిపారు. ప్రస్తుతం లక్ష్మీ ప్రశాంతిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.