గిద్దలూరు: పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

గిద్దలూరు మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి స్పౌజ్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలలో పాల్గొని మహిళలకు పెన్షన్లు పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో పెన్షన్ తీసుకుంటూ చనిపోయిన వ్యక్తి భార్యకు మరుసటి నెల నుంచే పెన్షన్ అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో 56 మందికి పెన్షన్లు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్