గిద్దలూరు: వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి బుధవారం ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చేనాయుడుని అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిశారు. పొగాకు రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పొగాకును వెంటనే కొనుగోలు చేసే విధంగా చూడాలని మంత్రికి ఎమ్మెల్యే విన్నవించారు. అలానే పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కూడా కల్పించాలని అశోక్ రెడ్డి కోరారు. సమస్యను పరిష్కరిస్తారని మంత్రి అన్నారు.

సంబంధిత పోస్ట్