ప్రకాశం జిల్లా గిద్దలూరు సబ్ రిజిస్టర్ కృష్ణ మోహన్ కు నెల్లూరు ఏసీబీ కోర్టు శుక్రవారం 14 రోజులు రిమాండ్ విధించింది. ఓ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసే విషయంలో రూ. 35 వేలు లంచం తీసుకుంటూ కృష్ణమోహన్ ఏసిబి అధికారులకు చిక్కాడు. కోర్టు రిమాండ్ విధించడంతో సబ్ రిజిస్టర్ను నెల్లూరు సబ్ జైలుకి తరలించారు. కృష్ణమోహన్ కు అదనపు ఆస్తులు కూడా ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు.